గే డేటింగ్ యాప్ ఒకరి ప్రాణం తీసింది. ఇద్దరు స్వలింగ సంపర్కులకు ‘గే డేటింగ్ యాప్’లో పరిచయం ఏర్పడింది. కృష్ణా జిల్లా, యనమలకుదురుకు చెందిన ప్రసాద్ కు గే డేటింగ్ యాప్ ద్వారా కోడూరుకు చెందిన తంగెళ్లమూడి సాయికృష్ణ పరిచయం అయ్యాడు. గత నెల 18వ తేదీన యనమలకుదురులో సాయికృష్ణ, ప్రసాద్ కలిశారు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వారి మధ్య ఘర్షణ తలెత్తింది. కర్రతో ప్రసాద్ తల, భుజంపై సాయికృష్ణ దాడి చేశాci. అక్కడి నుంచి వచ్చిన తరువాత ప్రసాద్ స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.