పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు రెండు సరికొత్త టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (శాన్‌ఫ్రాన్సిస్కో) శాస్త్రవేత్తలు ఈ టీకాలను అభివృద్ధి చేశారు. వీటికి ‘నావల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ఎన్ఓపీవీ) అని నామకరణం చేశారు. ఇటీవల వ్యాక్సిన్ రూపంలో అందించిన పోలియో వైరస్ కొన్ని సార్లు వ్యాధికారకంగా మారడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ‘ఎన్ఓపీవీ 1, ఎన్ఓపీవీ 3’ టీకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టీకాలు పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు పని చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.