విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. సి. యం. త్రివిక్రమ వర్మ గురువారం డయల్ యువర్ సిపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 26 మంది ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా కమిషనర్‌కు తెలియజేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ సంబంధిత అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యకు సంబంధించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకొని ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించవలసినదిగా ఆదేశాలు జారీ చేశారు.