కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ వాడివేడిగా ప్రసంగించారు.తనకు క్రిమినల్స్ అంటే చిరాకు అని స్పష్టం చేశారు. నేరాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వీరు మనల్ని పాలించేది.. ఈ దరిద్రులు మనల్ని పాలించేది.. ఈ సన్యాసులు మనల్ని పాలించేది.. గూండాలు, రౌడీలు, హంతకులు.. మనల్ని పాలించడం సిగ్గుచేటని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక వయసు వచ్చాక ప్రజలకు కావాల్సింది ఉపాధి అవకాశాలు, అభివృద్ధి అని పేర్కొన్నారు. అయితే, తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ లా ఏదో చేసేస్తానని చెప్పబోనని, కానీ ఒళ్లు వంచి మీ భవిష్యత్ కోసం పనిచేస్తా అని హామీ ఇచ్చారు. పిఠాపురం వస్తే విగ్రహాల ధ్వంసం గుర్తుకు వస్తుందన్నారు.