గుజరాత్‌ను వణికించిన బిపర్‌జోయ్ తుఫాన్ బలహీనపడింది. ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ పొరుగు రాష్ట్రమైన రాజస్థాన్ వైపు మళ్లిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాజస్థాన్‌లోని బార్మర్, జలోర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శనివారం రాజ్‌సమంద్, దుంగార్పూర్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ మేరకు రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది.