ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంపచోడవరం నుంచి మందపల్లి వెళ్తున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 9మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఆలమూరు మండలం మడికి ఎన్‌హెచ్‌పై చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa