ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా, ఈజిప్టు పర్యటనలకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 20 నుంచి 25 వరకు ఈ రెండు దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడం సహా బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. బైడెన్ దంపతుల ఆతిథ్యం స్వీకరించనున్నారు. జూన్ 24, 25 తేదీల్లో మోదీ ఈజిప్టులో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికారికంగా వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa