ఈ రోజుల్లో కూడా మూఢ నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటువంటి ఘటన తాజాగా ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. బిడ్డ పాలు తాగడం లేదని మూఢ నమ్మకాలతో వేడినూనెలో ఆ చిన్నారి వేళ్లు ముంచిన దారుణమైన ఘటన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనే జరిగింది. బారాబంకీ జిల్లా ఫతేపుర్ ప్రాంతం ఇస్రౌలి గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా బానో దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. అయితే బిడ్డ పాలు తాగకపోవడంతో వేడి వేడి నూనెలో బిడ్డ వేళ్లను ముంచింది.