కోడి ముందా? గుడ్డు ముందా? అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. కోడే ముందని తేల్చి చెప్పారు. పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు ఇప్పుడున్న రూపం సంతరించుకోకముందే పిల్లలకు జన్మినిచ్చాయని తెలిపారు. బ్రిస్టల్ వర్సిటీ పరిశోధకులు 51 శిలాజ జాతులు, 29 జీవ జాతులపై అధ్యయనం చేశారు. ఇవి మొదట్లో తమ పునరుత్పత్తికి నీటిపైనే ఆధారపడేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. గుడ్లు పెట్టడానికి బదులుగా పిల్లలకు జన్మనిచ్చాయని తేల్చి చెప్పారు.