వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ కుటుంబసభ్యులను టీడీపీ నేతలు పరామర్శించారు. శనివారం ఉదయం రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్.. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం చేరుకుని విద్యార్థి కుటుంబసభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేపల్లె చరిత్ర ఎన్నడూ లేని సంఘనలు జరుగుతున్నాయన్నారు. అక్కను వేధించడంపై ప్రశ్నించిన తమ్ముడును పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. పోలీసులు నిందుతులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. రేపల్లెలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా వాడుతున్నారని... గతంలో రేపల్లె రైల్వే స్టేషన్లో గర్భిణిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతలు నేరగాళ్ళను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. అమర్నాధ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ భరోసా ఇచ్చారు.