కృష్ణ జిల్లా, తిరువూరు మండలంలోని కాకర్ల సమీపంలో విజయవాడ-భద్రాచలం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎ.కొండూరు మండలం అట్లప్రగడ గ్రామానికి చెందిన పల్లెపోగు ఆశోక్(22)కంభంపాడుకు చెందిన మేడిపల్లి రవీంద్ర(20), గొల్లమందలతండాకు చెందిన భణావతు పవన్, కంభంపాడుకు చెందిన యశ్వంత్ పట్టణంలో సినిమా చూసి ఒకే ద్విచక్రవాహనంపై తిరిగి వెళుతూ ఎదు రుగా ఆయిల్ ట్యాంకర్‌ను తప్పించబోయి, విజయవాడ నుంచి తిరువూరు వైపు వస్తున్న కారును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో పల్లెపోగు ఆశోక్ అక్కడిక్కడే మృతి చెందగా మేడేపల్లి రవీంద్ర స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. యశ్వంత్‌కు తీవ్రగాయాలు కాగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలిం చారు. బాణావతు పవన్‌ను పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్సనిమిత్తం చేర్పించారు. పట్టణ సెక్టార్-1 ఎస్సై సతీష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.