చెరుకుపల్లి మండలంలోని ఆళ్ళవారి పాలెం పంచాయతీ పరిధి లోని ఉప్పాల వారి పాలెం గ్రామంలో ఈనెల 18వ తేదీ ఆదివారం జరగవలసిన మంత్రి జోగి రమేష్, ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు పర్యటన వాయిదా పడినట్లు చెరుకుపల్లి మండల వైసీపీ కన్వీనర్ పైనం ఏడుకొండలు రెడ్డి తెలిపారు. అనివార్య కారణాలవల్ల మంత్రి పర్యటన వాయిదా పడిందని త్వరలోనే విద్యార్థి అమర్నాథ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన పది లక్షల రూపాయల చెక్కును అందజేస్తారని తెలిపారు.