మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నులకపేటలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆర్థిక సహకారంతో శనివారం ముగ్గురికి ఫ్లాట్ ఫారం రిక్షాలను వితరణ చేశారు. వివరాలిలా ఉన్నాయి. నులకపేట చెందిన సానికొమ్ము కాశిరెడ్డి, ముగ్గురోడ్డు కు చెందిన పోలంపల్లి రాజు, సీతానగరం ప్రాంతానికి చెందిన సాంబయ్యల ప్లాట్ ఫామ్ రిక్షాలు పాడైపోవడంతో కొత్త వాటిని కొనుగోలుచేసే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్థానిక వైసిపి నాయకులు ద్వారా విషయాన్ని అందుకున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పందించి వీరి జీవోనోపాధికి ప్లాట్ ఫారం రిక్షాలను స్థానిక నాయకుల చేతుల మీదుగా అందజేయించారు.
కష్టకాలంలో తమకు చేయూతనందించిన ఎమ్మెల్యే ఆర్కేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదులముడి డేవిడ్ రాజు, గుంటూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేక వెంకటరామిరెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ కన్వినర్ మేడా వెంకటేశ్వరరావు (పండు), జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి చిన్నపోతుల దుర్గారావు, తాడేపల్లి పట్టణ ఎస్సీ యూత్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ముదిగొండ ప్రకాష్, తుమ్మపూడి మహేష్ రెడ్డి, సయ్యద్ రసూల్, పార్టీ నాయకులు నన్నం ప్రభాకర్, జగదీష్, తేజ, అనిల్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.