మంగళగిరి నగరంలోని లక్ష్మీనరసింహుని ఆలయానికి చెందిన కళ్యాణ పుష్కరిణి పెద్ద కోనేరు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం దేవాలయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న మెట్ల మరమ్మత్తుల పనులను ఆయన పరిశీలించారు. కోనేరు పూడికతీత పనులు ఇప్పటికే 90% పూర్తయ్యాయని మిగిలిన 10% పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసినందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.