గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గం, తాడికొండ మండల పరిధిలోని లాం గ్రామంలో ప్రభుత్వ నిధులతో అధికారులు బోర్ పంపును ఏర్పాటు చేశారు. ఇటీవల లాం గ్రామానికి విచ్చేసిన తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ దృష్టికి లాం గ్రామ ప్రజలు మంచినీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కత్తెర సురేష్ అధికారులతో మాట్లాడి బోరు పంపును ఏర్పాటు చేయించినట్లు లాం వైసిపి నాయకులు ఆదివారం తెలిపారు. ఈ మేరకు బోర్ పంపు పనులను ఆదివారం మొదలుపెట్టారు.