వైద్య, ఆరోగ్య శాఖలో జోనల్ కేడర్ 3లో పని చేస్తున్న ఉద్యోగుల్లో బదిలీలకు అర్హులైన వారికి ఈనెల 19వ తేదీన ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ను 20వ తేదీకి వాయిదా వేస్తూ ప్రాంతీయ వైద్య, ఆరోగ్య సంచాలకులు యాస్మిన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 20న మంగళవారం నుంచి గురువారం వరకు వివిధ తరగతుల ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నారు.