ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లా రతన్‌పూర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు చనిపోయిన తన తాతలా ప్రవర్తిస్తున్నాడు. గత జన్మలో అమ్మమ్మ తన భార్య అని, తల్లి తన కుమార్తెగా, మేన మామలు కొడుకులంటూ చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. పాము కాటుతో ఈ బాలుడి తాత మనోజ్ మిశ్ర 2015లో చనిపోయాడు. మనోజ్ కుమార్తె రంజనకు ఆర్యన్ పుట్టాడు. ఇటీవల అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆర్యన్ విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తన పేరు మనోజ్‌గా, తన పేరిట బ్యాంకులో డబ్బులు ఉన్నాయంటూ ఆర్యన్ చెప్పుకొచ్చాడు. అది విని కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతున్నారు.