ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నెలో శనివారం అర్ధరాత్రి దంపతులపై దుండగులు పెట్రోల్‌పోసి నిప్పంటించారు. గ్రామానికి చెందిన నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతులు ఆరుబయట నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో భార్యభర్తలతో పాటు సమీపంలో నిద్రిస్తున్న మరో బాలికకూ మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa