బౌద్ధ భిక్షువుల ఏకాక్షరి సాధన, తత్వ సాధన, సత్య శోధనలో టీని అమితంగా సేవిస్తారు. బుద్ధుడి అనుగ్రహం వల్లే తేయాకు పుట్టిందని, ధ్యానంపై మనసు నిమగ్నం చేయడానికి టీ తాగుతుంటారు. దీనికి సంబంధించి చైనా, టిబెట్ బౌద్ధ ఆలయాల్లో ఓ కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. అదేంటంటే.. గౌతమ బుద్ధుడు తపస్సు చేసేటప్పుడు నిద్రావస్థ ఆవహించేదట. నిద్ర వల్ల తపస్సు భంగం కలగడంతో తన కనురెప్పలను కత్తిరించి విసిరేశారట. ఆ కనురెప్పల నుంచి తేయాకు మొక్క పుట్టిందని బౌద్ధ భిక్షువుల విశ్వాసం. అందుకే టీని అమితంగా ఇష్టపడతారు.