తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర రాష్ట్రాలకు ప్రయాణించే పలు రైళ్లు రద్దయ్యాయి. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మౌలిక వసతుల నిర్వహణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు 25 రైళ్లను రద్దు చేయగా.. ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేష్ తెలిపారు. అలాగే సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలకు సేవలందించే 23 ఎంఎంటీఎస్ రైళ్లను వారం రోజులపాటు రద్దు చేసినట్లు వెల్లడించారు.