భారత పార్లమెంట్ నూతన భవనంలో ఫొకాల్ట్ షెండ్యూలంను ఏర్పాటు చేశారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎస్సీఎస్ఎం) సంస్థ దీన్ని రూపొందించింది. ఇది పూర్తిగా ఫిరంగి లోహంతో తయారు చేశారు. దీని బరువు 36 కిలోలు, తీగ పొడవు 22 మీటర్లు ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న తీరును అర్థం చేసుకోవడానికి ఫొకాల్డ్ షెండ్యూలం తోడ్పడుతుంది.