దేశంలో మతంపేరుతో దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా పలువురు ముస్లిం యువకులు ఓ హిందూ యువకుడిపై దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. బిలాల్, ఫైజాన్, సాహిల్, సమీర్, ముఫిద్ అనే ముస్లిం యువకులు విజయ్ అనే హిందూ యువకుడిపై తీవ్రంగా దాడి చేశారు. అనంతరం హిందూ యువకుడిని బెదిరించి కుక్కలా నడిపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.