వైఎస్ వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు అవినాష్ కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం సునీత పిటిషన్ పై సమాధానం ఇవ్వాలంటూ అవినాష్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3కి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa