అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అనుమతులు లేని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు, అధిక ఫీజు వసూలు మరియు అక్రమంగా వసతి గృహాలను నడుపుతున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాధ్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి ఉమ్మిడి నితిన్ మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ కబంధహస్తాలలో విద్యార్థుల భావి భవిష్యత్తులు నాశనం అవుతున్నాయని అన్నారు. నగరంలో పలు ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలు అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలలో తరగతులు నిర్వహిస్తున్నారని ఒలంపియడ్, టాలెంట్ టెస్ట్, సూపర్ టెక్నో పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు భారం అవుతున్నారు అన్నారు ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి త్రొక్కుతూ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలను గుర్తింపును రద్దు చేయాలని లేనిపక్షంలో ఏబీవీపీ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాజు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్ , సతీష్ , ఎల్లాజీ మరియు తదితరులు పాల్గొన్నారు.