లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పోలవరం తో సహా సాగునీరు ప్రాజెక్టులను జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సోమవారంం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని శాసనసభలో ప్రగల్బాలు పలికిన జగన్ మరల మరోసారి శాసనసభలో 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని కోతలు కోశారని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా వైసీపీ ప్రభుత్వానికి లేదనివెంకటరావు అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సత్యనారాయణ కే జగన్ తదితరులు పాల్గొన్నారు