మహాత్మా గాంధీ శాంతి బహుమతిని అందుకోనున్న గీతా ప్రెస్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు. గీతా ప్రెస్ చేసిన అవిరామ కృషి వల్లే బారత సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలను చదువగలుగుతున్నామని తెలిపారు. ఆ ప్రెస్కు బహుమతిని అందించడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. మరిన్ని గ్రంథాలను గీతా ప్రెస్ ప్రచురించాలని ఆకాంక్షించారు.