భారత నిఘా విభాగమైన రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్(RAW ) అధిపతిగా ఐపీఎస్ అధికారి రవి సిన్హాను ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయానికి ‘నియామకాలపై కేంద్ర మంత్రుల కమిటీ’ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న సమంత్ కుమార్ గోయల్ రిటైర్మెంట్ తీసుకోనున్నారు. కాగా, 1988 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రవి సిన్హా గత ఏడేళ్లుగా 'RAW ' ఆపరేషనల్ విభాగంలో అధిపతిగా పనిచేస్తున్నారు.