ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నియోజకవర్గ సమస్యలపై టిడిపి అధ్యక్షులతో చర్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 20, 2023, 01:35 PM

సాలూరు నియోజకవర్గంతో పాటు మక్కువ మండలంలో తెలుగుదేశం పార్టీ సమస్యలపై మండల టీడీపీ మాజీ అధ్యక్షులు పెంట తిరుపతిరావు ఆ పార్డీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెం నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. సోమవారం అమరావతిలో అచ్చెంనాయుడుని మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో బూత్ కమిటీలు బలహీనతలు, పార్టీ సమావేశాలు ముఖ్య నాయకులకు తెలియకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిర్వహించడ. ఏకపక్ష నిర్ణయాలతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి జరుగుతున్న నష్టం తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మక్కువ మండల పార్టీ మాజీ అధ్యక్షులు పెంట తిరుపతిరావు పాటు పాచి పంట మండల మాజీ అధ్యక్షులు పిన్నింటి ఈశ్వర తదితరులు ఉన్నారు. అనంతరం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను కలిసి మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com