స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటవరకూ చాలా మారుమూల గిరిజన గ్రామాల్లో కనీసం మట్టి రోడ్డు సౌకర్యం అయినా ఉంది. కానీ పాడేరు జిల్లా కేంద్రానికి 15 కి. మీ ల్లో ఉన్న పెదబయలు మండలం పెద కోడాపల్లి పంచాయితీ చెందిన చెక్కారాయి, బొండపుట్టు, మొండికోట, బరంగిభంద, నైమోంగొంది గ్రామాలకు మాత్రం కనీస రోడ్డు సౌకర్యం లేదు.
వర్షాకాలంలో ఈ గ్రామ ప్రజలకి వైద్యం అందని ద్రాక్షే. సంబంధిత అధికారులకి, ప్రజాప్రతినిధులకు ఎన్నో సార్లు విన్నవించుకున్న ఫలితం లేదు అని, స్వయంగా గ్రామ ప్రజలే బోసర జంక్షన్ నుండి పిల్లిపుట్ చెక్కరాయి జంక్షన్ వరకు కొలతలు కొలచగా పాత రోడ్డు పొడవు 580 మీ వచ్చింది.
ఈ 580 మీ, రోడ్డు నిర్మిస్తే చాలు అని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఈ సీసీ రోడ్డు నిర్మించడం వల్ల పెదబయలు, పాడేరు, జి. మాడుగుల మండలాలకు చెందిన రైతుల నిత్యావసరాలు, విద్య, వైద్య అనుకూలంగా ఉంటుందని వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని ఆశిస్తున్నారు.