చోడవరం నియోజవర్గ పరిధిలో గల రావికమతం మండలం జెడ్ కొత్తపట్నం సచివాలయం పరిధిలో గల గంపవానిపాలెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొని ప్రతి గడప గడపలో అక్కడ వాళ్లకు ఉన్న సమస్యలు తెలుసుకొను సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంకా అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారికి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. అలాగే ప్రతి కుటుంబానికి గడిచిన నాలుగేళ్ల కాలంలో ఎంత లబ్ధి పొందిందో వివరించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అయన చెప్పారు. ఆయా గ్రామాలకు సంక్షేమ అభివృద్ధి పేరుతో మంజూరైన నిధుల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.