కేవలం విద్యా రంగ సంస్కరణలపైనే ప్రభుత్వం అక్షరాలా రూ.60,329 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా సంస్థల్లో చదువుతూ.. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది, ఇంటర్‌మీడియట్ గ్రూపుల వారీగా టాపర్స్‌గా సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డులను ప్రదానం చేయనున్నారు. విజయవాడ ఎ–కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం జరిగే వేడుకలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులను సత్కరించనున్నారు.