రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఈ నెల 22 వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఖరగ్‌పుర్ డివిజన్‌లో భద్రతాపరమైన పనులు కొనసాగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 19న ఎర్నాకుళం-పాట్నా (22643), 20న రైలు నంబర్ (18045) షాలిమార్-హైదరాబాద్, అలాగే హైదరాబాద్-షాలిమార్ (18046), ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (22825), షాలిమార్-విశాఖ (22853), సంత్రాగచ్చి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(22807), సికింద్రాబాద్-షాలిమార్(12774), విల్లుపురం-ఖరగ్‌పుర్(22604), హౌరా-ఎస్‌ఎంవీ బెంగళూరు(22887) రైళ్లను రద్దు చేశారు.
ఈ 21న ఎస్‌ఎంవీ బెంగళూరు- హౌరా (22864), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- షాలిమార్(22826).. ఇటు ఈ నెల 22న పాట్నా-ఎర్నాకుళం(22644), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి(22808) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. అంతేకాదు.. విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో ఈనెల 25 వరకు పలు రైళ్లను రద్దు చేస్తోన్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గుంటూరువిజయవాడ రైల్వే డివిజన్ల పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
రైలు నంబర్ (17239) గుంటూరు -విశాఖపట్టణం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 19 నుంచి 25వ వరకు.. అలాగే రైలు నంబరు. (17240) విశాఖపట్టణం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఈనెల 20 నుంచి 26 వరకు రద్దు చేశారు. ఈ నెల 21న రైలు నంబరు (07629) విజయవాడ - తెనాలి, రైలు నంబరు (07874) తెనాలి - రేపల్లె, రైలు నంబర్ (07875) రేపల్లె - తెనాలి, ఈ నెల 22న రైలు నంబర్ (07282) తెనాలి - గుంటూరు, 24న రైలు నంబర్ (07783) విజయవాడ - గుంటూరు రైలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఈ నెల 19 నుంచి 25 వరకు కాచీగూడ - నడికుడి (07791 ), నడికుడి - కాచీగూడ (07792 ), గుంటూరు - విజయవాడ (07783), గుంటూరు - మాచర్ల (07779 ), మాచర్ల - గుంటూరు (07780), మాచర్ల - నడికుడి (07580 ), నడికుడి - మాచర్ల (07579 ), నరసాపూర్ - గుంటూరు (17282), గుంటూరు - నరసాపూర్ (17281 ), గుంటూరు డోన్ ఎక్స్‌ప్రెస్ (17228 )లు రద్దయ్యాయి.
డోన్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17227)ను ఈ నెల 20 నుంచి 26 వరకు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రేపల్లె -మార్కాపురం రోడ్డు (07889) రైలుని ఈ నెల 19 నుంచి 25వ వరకు గుంటూరు వరకే నడపనున్నారు. మార్కాపురం రోడ్డు - తెనాలి రైలు (07890)ని మార్కాపురం నుంచి గుంటూరు మధ్యన రద్దు చేస్తున్నారు. గుంటూరు - తెనాలి మధ్యన నడుపుతున్నారు. ఈ మార్పులను ప్రయాణీకులు గమనించాలన్నారు. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో 28 రైళ్లను ఈ నెల 19- 25 వరకు పూర్తిగా చేశారు. మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నిర్వహణ పనులు చేపడుతుండటంతో కాజీపేట-డోర్నకల్-కాజీపేట, భద్రాచలంరోడ్-విజయవాడ-భద్రాచలంరోడ్, సికింద్రాబాద్-వికారాబాద్-సికింద్రాబాద్, డోర్నకల్-విజయవాడ-డోర్నకల్, సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్, కరీంనగర్-నిజామాబాద్-కరీంనగర్, కాచిగూడ-నడికుడి-కాచిగూడ రైళ్లు ఉన్నాయి.