అమెరికాలోని హోండురస్ జైలులో దారుణం జరిగింది. తమారా మహిళా జైలులో మంగళవారం ఖైదీలు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 41 మంది ఖైదీలు మృతిచెందారు. వీరిలో కొందరు సజీవదహనం కాగా, మరికొందరు బుల్లెట్ గాయాలతో మరణించారు. మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జైళ్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే అల్లర్లు జరిగాయని అధికారులు తెలిపారు.