వెంకటగిరి చేనేతకు ప్రత్యేక బ్రాండ్ ఉందని నారా లోకేశ్ అన్నారు. ఇక్కడి చేనేతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. తన తల్లి, భార్య బ్రాహ్మణి కూడా వెంకటగిరి చీరలు కట్టుకుంటారని చెప్పారు. ఈ రంగంలో నూతన డిజైన్స్ తీసుకురావాలని, కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం వీవర్స్ డైరెక్ట్.ఇన్ వెబ్‌సైట్‌ను తిరుపతి జిల్లా వెంకటగిరిలో గురువారం లోకేశ్ ఆవిష్కరించనున్నారు. చేనేత రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి, కళాకారులకు సురక్షిత పనిపరిస్థితులు, దళారీలు లేకుండా ఉత్పత్తులను తామే అమ్ముకునే వెసులుబాటు, యంత్రాలు సమకూర్చడం, ఆధునిక తరానికి అనుగుణంగా మోడళ్లు, డిజైన్లు నేసేలా శిక్షణ తదితర అంశాల్లో చేనేతలకు సాయం చేయనున్నారు.