మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తారని భావిస్తున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యకదర్శి వేణుగోపాల్ తెలిపారు. 53రోజులుగా మణిపూర్ తగలబడుతుందని, ప్రజలు ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదని, మణిపూర్ అధికారులు ఢిల్లీకి వచ్చి పది రోజులవుతున్నా వారిని కలిసేందుకు కూడా మోదీ సిద్ధంగా లేరంటూ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.