దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి ఎగురుతున్న డ్రోన్‌ను గురువారం జవాన్లు నేలకూల్చారు. ఈ డ్రోన్‌లో రెండు కిలోల హెరాయిన్ ఉందని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. ఫజిల్కా జిల్లాలోని జోధ్ వాలా గ్రామ అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ కనిపించడంతో అప్రమత్తమైన జవాన్లు వెంటనే దానిని కూల్చివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa