రాష్ట్రంలో బీసీల హక్కులను వైసిపి ప్రభుత్వం కాలరాస్తుందని టిడిపి జాతీయ కమిటీ సభ్యుడు, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు విమర్శించారు. గురువారం దాచేపల్లి టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు నామమాత్రపు పదవులు ఇచ్చి నిధులు లేని కాళీ కార్పొరేషన్లు అప్పగించారని విమర్శించారు. బీసీ సెల్ రాష్ట్ర కార్య దర్శి ముశ్యం శ్రీనివాసరావు, బీసీ నాయకులు పాల్గొన్నారు.