ఏపీ వ్యాప్తంగా దేవాలయాల్లో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆలయాల్లో ఒకే చోట ఏళ్ల తరబడి తిష్టవేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయాల్లో AEO, సూపరిండెంటెంట్లు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్స్,రికార్డింగ్ అసిస్టెంట్స్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆలయాల్లో ఉద్యోగుల డ్యూటీలు మార్చాలని ఆదేశించారు.