ఏపీ సీఎం జగన్ నేడు 'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుండి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులై ఉండి సంక్షేమ పథకాలు పొందని వారిని గుర్తించి మేలు చేస్తారు. రాష్ట్రంలోని 15 వేల గ్రామ, వార్డు సచివాలయాస పరిధిలో నెలరోజులపాటు దీన్ని నిర్వహిస్తారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కలిసి 1.6 కోట్ల ఇళ్లను సందర్శించనున్నారు.
ఈ పథకం అమలుపై తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత కలెక్టర్లు, ఎస్సీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి అర్హులకు పథకాలు మంజూరు చేయాలని ఆదేశించారు.ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూన్ 23 నుంచి ఈ కొత్త కార్యక్రమం ప్రారంభం కానుంది.ప్రతి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు ఈ కొత్త కార్యక్రమంలో భాగంగానే ఈ కొత్త కార్యక్రమం చేపట్టినట్లు వైఎస్ జగన్ తెలిపారు.