ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత దంతాలు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే బ్రష్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూట బ్రష్ చేసుకోవాలి. నాణ్యమైన బ్రష్, టూత్‌పేస్టులు వాడాలి. ఎక్కువ కాలం బ్రష్ వాడరాదు. అలాగే టంగ్ క్లీనర్‌ను ఉపయోగించి నాలుకను శుభ్రం చేసుకోవాలి. గట్టిగా రుద్దకుండా మృదువుగా వాడాలి. బలంగా రుద్దడం వల్ల నాలుకపై ఉండే రుచిగులికలు దెబ్బతింటాయి. అలాగే ఎక్కువ సేపు బ్రెష్ చేసుకోవద్దు. దీని వల్ల దంతాలపై ఉండే ఎనామెల్ పొర కరిగిపోతుంది.