అగ్రరాజ్యం అమెరికా హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు ఇక నుండి తమ వర్క్ వీసాల రెన్యూవల్ కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. వారు అమెరికాలోనే తమ వర్క్ వీసాలను రెన్యూవల్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీని కోసం త్వరలో పైలెట్ ప్రోగ్రామ్ ను త్వరలో చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా, అమెరికాలోని హెచ్-1బీ వీసాదారుల్లో ఎక్కువమంది భారతీయులే ఉన్నారు.