షిర్డీ సాయినాథుడికి ఏప్రిల్ 25 నుండి జూన్ 15 వరకు రూ. 47 కోట్ల కానుకలు వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం రూ. 9.83 కోట్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 5.15 కోట్లు, ఆన్ లైన్ విరాళాలు రూ. 3.34 కోట్లు, చెక్కులు, డీడీల ద్వారా రూ. 1.82 కోట్లు, రూ. 1.17 కోట్ల బంగారం, 52 కేజీల వెండి వచ్చిందని పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుండి జూన్ 15 మధ్య స్వామిని 26 లక్షల మంది దర్షించుకున్నారని తెలిపారు.