పులివెందుల మున్సిపల్ పరిధిలో అక్రమ కొళాయి కనెక్షన్లను రెగ్యులర్ చేయించాలని మునిసిపల్ ఇంచార్జి వైయస్ మనోహర్ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని నీటి సరఫరా మస్టర్ పాయింట్ ను మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్ , మున్సిపల్ కమిషన్ నర్సింహారెడ్డి తో కలిసి ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. అక్రమ కొళాయి కనెక్షన్లను వంద శాతం రెగ్యులర్ చేయించే విషయంలో సిబ్బంది ఆశించిన రీతిలో పనిచేయకపోతే వారి జీతాలు సైతం నిలుపుతామన్నారు. అనంతరం వారు వార్డులలో పర్యటించారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి అజయ్ కుమార్, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.