జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు చేతకాకుంటే తమ పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని ఆరోపించారు. వారాహి యాత్రను వదిలి నారా యాత్ర చేస్తున్నాడని మండిపడ్డారు. కేవలం 15 సీట్లకే పవన్ అమ్ముడుపోయాడని, 175 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీలాగా పోటీ చేసే దమ్ముందా అని నిలదీశారు. రాష్ట్ర పాలనలో పాలకులు విఫలమయ్యారని, ఆంధ్ర రాష్ట్రం రావణకాష్టంలా మారిందన్నారు.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ మరోసారి లేఖ రాశారు. కాకినాడ నుంచి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. ఒక వేళ అది కుదరకపోతే పిఠాపురం నుంచి పోటీ చేసి.. తనపై పోటీ చేయాలని ముద్రగడ తెలిపారు. జనసైనికులు తనను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణాన్ని కల్పించినందుకు సంతోషంగా ఉందని, మీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. దమ్ముంటే మీరు రంగంలోకి వచ్చి మాట్లాడండని ముద్రగడ.. పవన్ కళ్యాణ్‌కు సవాల్ చేశారు.