ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని వ్యాపారాలు నాశనం చేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 23, 2023, 01:19 PM

జగన్‌ మళ్లీ సీఎం అయితే రాష్ట్రం అథోగతే పాలేనని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... మరోసారి జగన్మో హన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపడితే.. ఇక రాష్ట్రం వల్లకాడు కాక తప్పదని ప్రజలంతా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దారుణ పరిస్థితులు వస్తాయని అన్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ కుటుంబానికే రక్షణ లేక పక్క రాష్ట్రానికి వెళ్లిపోయి వ్యాపారం చేసుకుంటానని చెప్పాడంటే.. ఇక రాష్ట్ర ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్‌ అధికారం చేపట్టగానే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలపై తన ప్రతాపం చూపాడని, అధికారం అడ్డం పెట్టుకుని వ్యాపారులపై మోయలేని విధంగా పన్నులు విధిస్తూ వేధింపు లకు గురి చేశారని, వైజాగ్‌ ఎంపీ సంఘటనే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేస్తున్న దందాల కారణంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా సర్వనాశనమైపోయిందని, కర్నూలు, విశాఖ, విజయవాడ, అమరావతి వంటి ప్రాంతాల్లో పూర్తిగా నిర్మాణాలు నిలిచిపోయి ఎంతో మంది జీవనోపాధి కోల్పోయారని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com