అనారోగ్యంతో బాధపడుతున్న తలిదండ్రులను సరిగ్గా చూసుకోలేకపోతున్నానని మనస్థాపానికి గురై పురుగుమందు తాగి ముదునూరు లో ఏసీ మెకానిక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉయ్యూరు రూరల్ పోలీసుల వివరాల ప్రకారం ముదునూరుకు చెందిన ఏసీ మెకానిక్ మహాళి రాజేశ్(22) అనారోగ్యంగా ఉన్న తలిదండ్రులను తనకొచ్చే ఆదాయంతో పోషించలేక పోతున్నానని మనస్థాపం చెంది బుధవారం రాత్రి పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మరణించాడు.