ముఖ్యమంత్రి వైయస్ జగన్ బ్రాండ్ చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. గతంలో ఏపీ వైపు చూడని సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. 2022లో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 18 శాతం రాష్ట్రానికే వచ్చాయన్నారు. పెట్టుబడులను ఆకర్శించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. రాష్ట్ర బ్రాంచ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు చంద్రబాబు, పవన్ కుట్రలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.