ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఇటీవలే సుప్రీం జడ్జిగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా మిశ్రాను ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆయన గౌరవార్థం ప్రభుత్వం ఆత్మీయ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో గురువారం జరిగిన కార్యక్రమం, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను సీఎం వైయస్ జగన్ సత్కరించి, మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి,హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.