ఫేస్ బుక్ స్నేహితుడు ఓ యువతిని నగ్నంగా వీడి యోలో చిత్రీకరించి ఆమె పెళ్లి చెడగొట్టేందుకు చేసిన ప్రయత్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం బయటపడడంతో వీడియో వైరల్ చేసిన వ్యక్తితో పాటు యువతితో పెళ్లికి సిద్దమైన యువకుడిపై, పెళ్లి పెద్దలపై కూడా కేసులు నమోదుకు కారణమైంది. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా మరిన్ని విషయాలు బయటపడ్డాయని కృష్ణా జిల్లా గుడివాడ టూటౌన్ పోలీసులు తెలిపారు. గుడివాడ పట్టణానికి చెందిన ఒక యువతికి ఫేస్ బుక్ ద్వారా కర్రా న్యూటన్ బాబు పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో అతడి కోరిక మేరకు ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఈ క్రమంలో ఆ యువతికి ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో వివాహం నిశ్చయమైంది. దీంతో యువతి తన కాబోయే భర్త అని అతనితో కూడా శారీరకంగా దగ్గరైంది. ఈ నెల 14న వివాహం జరగాల్సి ఉండగా న్యూటన్ బాబు యువతితో మాట్లాడిన న్యూడ్ వీడియోను పెండ్లి కుమారుడు పరం జ్యోతికి పంపాడు. పరంజ్యోతి ఆ వీడియోను పెళ్లి కుదిర్చిన పెద్దలకు పంపి ఈ పెళ్లొద్దని నిరాకరించాడు. ఈ క్రమంలో పెళ్లి పెద్ద గుర్రం జాషువా జ్యోతి ఆ వీడియోను యువతి కుటుంబానికి పంపి పెళ్లి కుదరదని తెలిపారు. అలాగే న్యూటన్ బాబు బంధువులు బాపట్ల కోటేశ్వరరావు, కొండ్రు రణధీర్ సైతం ఆ నగ్న వీడియోను మరికొందరికి పంపారని పోలీసులు గుర్తించారు. వారందరిపై కేసులు నమోదు చేసిన సీఐ బి. తులసీధర్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆధారాలు సేకరించారు. యవతిని బెదిరించి నగ్న వీడియోను చిత్రీకరించిన న్యూటన్ బాబుపై అత్యాచార యత్నం కేసు, పరంజ్యోతిపై అత్యాచారం కేసు, జాషువా జ్యోతి, కోటేశ్వరరావు, రణధీర్లపై 109, 120(బి) ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి గురువారం కోర్టుకు తరలించారు. ఎవరి వైనా వ్యక్తిగత నగ్న వీడియోలను ఎవరైనా పంపితే వాటిని డిలీట్ చేయకుండా సామాజిక మాధ్యమాల్లో పంపితే వారికి జైలు శిక్ష తప్పదని సీఐ తులసీధర్ హెచ్చరించారు.