సంగారెడ్డి సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనచ్చంటూ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. ‘‘అచ్యుతాపురంలో ఎకరా స్థలం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనచ్చు అంటూ వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి కానీ.. తెలంగాణలో మాత్రం ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు.